1800
స్వరూపం
1800 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1797 1798 1799 - 1800 - 1801 1802 1803 |
దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- నవంబర్ 17: అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి కాంగ్రెస్ సమావేశం వాషింగ్టన్, డి.సి.లో జరిగింది.
- అక్టోబర్ 12: నిజాం ప్రభువు అనంతపురం, కర్నూలు, కడప, బళ్ళారి ప్రాంతాలను బ్రిటిష్ సైన్యానికి దత్తత ఇచ్చాడు.
- స్కాటిష్ శాస్త్రవేత్త విలియం కంబర్లాండ్ క్రూయిక్షాంక్ కార్బన్ మొనాక్సైడ్ వాయువులో కార్బన్, ఆక్సిజన్ కలిగి ఉన్నదని నిరూపించాడు.
జననాలు
[మార్చు]- జనవరి 7: మిల్లర్డ్ ఫిల్మోర్ - అమెరికా సంయుక్తరాష్ట్రాల 13వ అధ్యక్షుడు. (మ.1874)
- జూలై 31: ఫ్రెడ్రిక్ ఓలర్ - జర్మన్ రసాయనిక శాస్త్రవేత్త. ఆర్గానిక్ కెమిస్ట్రీ పితామహుడు. (మ.1882)
- సెప్టెంబర్ 22: జార్జి బెంథామ్ - బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్త.(మ.1884)
- అక్టోబర్ 25 : లార్డ్ మెకాలే - భారతశిక్షాస్మృతి సృష్టికర్త, మొదటి లా కమీషన్ ఛైర్మన్, భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసినవాడు.(మ.1859)
- డిసెంబర్ 3 : ఫ్రాన్స్ ప్రీసెరెన్ - స్లోవేనియాకు చెందిన జాతీయకవి. (మ.1849)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- మోమిన్ ఖాన్ మోమిన్ - భారతదేశానికి చెందిన ఉర్దూ గజల్ కవి. (మ.1851)
- మధుసూదన్ గుప్త - అల్లోపతి వైద్యంలో డిప్లొమో పొందిన మొదటి భారతీయుడు. (మ.1856)
మరణాలు
[మార్చు]- మార్చి 13 : నానా ఫడ్నవీసు - మరాఠా సామ్రాజ్యంలో పీష్వాల మంత్రి (జ.1742)