వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:New rail bridge.jpg
రాజమండ్రిలో గోదావరి నదిమీద కొత్త వంతెన.

వంతెన (Bridge) వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడాలు. వంతనను సంస్కృతంలో సేతువు అంటారు. ఇవి ఎక్కువగా నదులు, రహదారి, లోయలు మొదలైన భౌతిక అడ్డంకుల్ని అధిగమించడానికి నిర్దేశించినవి.

వంతెనలలో రకాలు

ఇనుప వంతెనలు

కేవలం ఇనుమును మాత్రమే ఉపయోగించి నిర్మించబడే వంతెనలు. భారతదేశములో ఇలాంటివి ఎక్కువగా బ్రిటిష్ వారి కాలములో నిర్మించబడ్డాయి. ఇనుప కమ్ములు, ఇనుప దూలాలను వినియోగించి నిర్మించిన ఇలాంటి వంతెనలు ఇప్పటికీ చెక్కుచెదరక నిలిచి ఉన్నాయి.

కాంక్రీటు వంతెనలు

కాంక్రీటును ఇనుప చట్రాలలో పోసి తయారుచేసే పలకలతో, స్తంబాలతో నిర్మించే వంతెనలు కాంక్రీటు వంతెనలు. ప్రస్తుతము కట్టబడుతున్న అన్ని వంతెనలు ఇంచుమించు ఇలాంటివే. ఇవి ఎంతో పటిష్టంగా ఉండటంతోపాటు ఎక్కువ జీవితకాలాన్ని కలిగిఉంటాయి.

తాళ్ళ వంతెనలు

తాళ్ళతోనూ, వెదురు బద్దలతోను నిర్మించబడేవి తాళ్ళ వంతెనలు. అడవులలో చిన్నచిన్న లోయలను కలుపుటకు, తాత్కాలిక వంతెనలు అవసరమయినపుడు వీటిని ఉపయోగిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలు అభిబృద్ధి చెందని రోజుల్లో ఎక్కువగా ఈ తాళ్ళ వంతెనలే నిర్మించబడేవి. ప్రస్తుతము పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులను ఆకర్షించుటకు వీటిని నిర్మిస్తున్నారు.

చెక్క వంతెనలు

పూర్తిగా చెక్కతో నిర్మితమయ్యే వంతెనలు చెక్క వంతెనలు. కలపను చెక్కలుగా కోసి వాటిని మేకులు లేదా తాళ్ళతో అతికించి నిర్మిస్తారు. ఇవి తాళ్ళ వంతెనల కన్నా ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి.

ప్రపంచములో అతి పెద్ద వంతెనలు

భారతదేశంలో వంతెనలు

విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి మరియు రైలు వంతెన

రోడ్డు వంతెనలు

రైలు వంతెనలు

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=వంతెన&oldid=798301" నుండి వెలికితీశారు