వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి మరియు రైలు వంతెన

వంతెన (Bridge) వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడాలు. వంతనను సంస్కృతంలో సేతువు అంటారు. ఇవి ఎక్కువగా నదులు, రహదారి, లోయలు మొదలైన భౌతిక అడ్డంకుల్ని అధిగమించడానికి నిర్దేశించినవి. రహదార్లను ఎంత బ్రహ్మాండంగా నిర్మించినా అవి నదుల దగ్గర ఠపీమని ఆగిపోతె ప్రయోజనముండదు. రోడ్లు ఎంత ముఖ్యమో వంతెనలు కూడా అంతే అవసరం.

చరిత్ర

మొట్టమొదటి వంతెనలు పొడుగాటి చెట్లతో నిర్మించేవారు. రెడు గట్టుల మీద చివరలు ఆనుకొని ఉండేలా చెట్లను కాలువకు అడ్డంగా వేసి, ఈ ఏర్పాటును వంతెనగా ఉపయోగించేవారు. క్రీ.పూ. 450 ప్రాంతంలో బల్ల కట్టు తో తాత్కాలిక వంతెనలు ఏర్పరచి వాటికి ఊత గా పడవలను వాడేవారు. కాలువ మధ్య లో రెండు, మూడు చోట్ల రాతి స్తంభాలను కత్టి, వాటిపై దూలాలను పరచి వంతెనగా వాడటం తరువాత ప్రారంభమైంది. ఇలాంటి వంతెనని బేబిలాన్ లో యూఫ్రటిస్ నదికి అడ్డంగా నిర్మించారని ప్రతీతి. ప్రాచీన చైనా లో అనేక నదులకు అడ్డాంగా తాళ్ళ వంతెనలు నిర్మించారు. ఇందులో పొడుగాటి వేదికను తాళ్ళతో గానీ, గొలుసుతో గానీ వేలాడదీస్తారు. 200 అడుగుల పొడవు గల ఇలాంటి వంతెనలు పెరు దేశంలోని 'ఇంకా' సామ్రాజ్యంలో కూడా వాడుకలో ఉండేవి.

వంతెన నిర్మాణాలు

రోమనులు రోద్లు వేయటంతో బాటు వంతెన నిర్మాణాలు కూడా చేశారు. వారు నిర్మించిన కట్టడాలూ, సొరంగాలూ ఇప్పటికీ ఉన్నాయి. క్రీ.శ.100 ప్రాంతంలో డాన్యూబ్ నదికి 150 అడుగుల ఎత్తుగల స్థంభాలపై కొత్త కమానులతో వంతెనను నిర్మించారు. ఈ కమానులు అర్థవృత్తాకారంగా ఉండేవి. రోమన్ సామ్రాజ్యం అంతరించిన తర్వాత వెయ్యి సంవత్సరాల వరకు వంతెన నిర్మాణం యూరప్ ఖండంలో దాదాపు జరగలేదు. 12 వ శతాభ్దంలో మాత్రం అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన వంతెనలు నిర్మించబడి ఉండవచ్చు గానీ పదవ శతాబ్దం నాటికి ఒక కొయ్య వంతెన మాత్రమే మిగిలింది. ఇది కూడా తుఫానులో ధ్వంశమైంది. దీని తర్వాత కట్తిన మరో వంతెన కూలిపోయింది. పీటర్ డీకోల్ చర్చ్ అనే మత గురువు 1176 లో రాతి వంతెన నిర్మించటం ప్రారంభించి, 1209 లో పూర్తి చేశాడు. 900 అడుగుల పొడవు, 19 కమానులు కలిగిన ఈ వంతెన కింద ఓడలు సులభంగా పోగలుగుతుండేవి. తరచుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బ తిన్నప్పటికీ, ఈ వంతెన సుమారు ఆరు శతాబ్దాల కాలం మన గలిగింది. 1750 లో వెస్ట్ మినిస్టర్ వంతెన నిర్మాణమయ్యేంత వరకు ఇది లండన్ లోని ఏకైక వంతెనగా ఉండేది.

వంతెన నిర్మాణ కళ ఇటలీ లో పునరుద్ధరించబడింది. వెనిస్ నగరంలోని కాలువలపై నిర్మించబడిన అనేక చిన్న చిన్న వంతెనలు అందంగానూ, చూడ ముచ్చటగానూ ఉండేవి. అయినా సాంకేతిక నైపుణ్యంలో అడ్డానదిపై ట్రెజూ వద్ద నిర్మించిన వంతెన వీటన్నిటి కంటే ఉత్తమమైనది. ఈ వంతెన 240 అడుగుల పొడవు కల ఒకే కమాను కలిగి ఉండి, 70 అడుగుల ఎత్తులో ఉండేది. దీనిని 14 వ శతాబ్దంలో నిర్మించారు. నిర్మించిన యాభై యేళ్ల లోపుగానే ట్రెజూ కోట ముట్టడి సందర్భంగా ఇది ధ్వంసం చేయబడింది. ఇంచుమించు ఇదే కాలంలో వెరోనా వద్ద నిర్మించబడ్డ మరో వంఎన 1945 లో ఇటలీ నుంచి జర్మనీ లేన ఉపసంహరణ సందర్భంగా కసితొ నాశనం చేయబడింది. కానీ కొన్నాళ్ళకే దీన్ని మళ్ళీ కట్టారు.

ఆధునిక వంతెన నిర్మాణంలో వివిధ బలాల కలయికకు సంబందించిన పరిజ్ఞానం అవసరం. దీన్ని గురించి వివరంగా చర్చించే భౌతిక శాస్త్ర విభాగాన్ని స్థితి శాస్త్రం అందురు. 15,16 శతాబ్దాల్లో లియొనార్డో డానిన్సీ చేసిన కృషి ఆధునిక వంతెనల నిర్మాణానికి ఆధారభూతంగా ఉంటోంది. 18 వ శతాబ్దం చివరి భాగంలో వంతెన నిర్మాణానికి ఇనుమును పెద్ద ఎత్తున ఉపయోగించటం ప్రారంభించటమైనది. పోత ఇనుముతొ నిర్మించబదిన మొదటి వంతెన ఇంగ్లండ్ లో 1770 ప్రాంతంలో తయారయింది. కొన్ని దశాబ్దాల తరువాత జర్మనీ, ఫ్రాన్స్ దేసాలు ఇంగ్లండ్ ని అనుకరించాయి. తరువాతి దశలో ఇనుప మోకులతో గానీ(cables), గొలుసులతో గానీ వేలాడే వంతెనలను అమెరికాలో నిర్మించటం జరిగింది. మెన చూసెట్స్ లో 240 అడుగుల పొడవుతో ఇలాంటి వంతెనను 1809 లో నిర్మించారు. దీన్ని ఇప్పటికీ చూడవచ్చు. సాంకేతిక; పరిజ్ఞానం పెరిగే కొద్దీ, ఎక్కువ పొడవు గల వంతెనల నిర్మాణం చురుకుగా సాగింది. క్రమేణా స్విట్జర్లాండ్ లో దాదాపు 900 అడుగుల పొడవుతో వేలాడే వంతెనను నిర్మించటం సాధ్యమైంది.

వేలాడే వంతెనలపై పనిచేసే బలాలను లెక్కించటం, నిర్మాణ పదార్థాలు దృఢత్వాన్ని పరీక్షించటం ఇతర నమూనాల కంటే ఖచ్చితంగా చేయవచ్చు. కాబట్టి 19,20 శతాబ్దాల్లో ఈ రకం వంఎనలు విస్తృతంగా నిర్మించబడ్డాయి. ఉదాహరణకు, ఏదైనా వేదికను వేలాడదీయటానికి సాగదీసిన తీగలు సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రయోగాల్లో తెలిసింది. ఈ కారణంగానే అనేక వేల పోగులు(Strands) గల ఉక్కు మోకులను వేలాడే వంతెనలు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ఫిలడెల్ఫియా-కాండెన్ రహదారిలో 1926 లో నిర్మించిన వంతెన 1750 అడుగుల పొడవుతో ఉంది. 18,666 తీగ పోగులను కలిగి 30 అంగుళాల వ్యాసం గల రెండు మోకులతో ఈ వంతెనను వ్రేలాడదీశారు. న్యూయార్క్ వద్ద ఈస్ట్ నదిపై ఇలాంటి వంతెనలు మరో మూడు ఉన్నాయి. వీటిలో శాన్‌ఫ్రాన్సిస్కో వద్ద నిర్మించిన వంతెన మూడు భాగాలుగా ఉంది. మధ్య భాగం పొడవు 4,200 అడుగులు, ఇరుపక్కలా ఒక్కొక్క భాగం 1,100 అడుగులు కలిగి ఉన్నాయి.

మూడు డచ్ ద్వీపాలను కలుపుతూ యూరప్ ఖండంలో నిర్మించబడిన వంతెన దాదాపు మూడు మైళ్ళ పొడవుతో ఉంది. అత్యంత మనోహరమైన ఈ వంతెన నిర్మాణం 1965 లో పూర్తి అయింది. స్కాట్లండ్ లో 500 అడుగుల ఎత్తు గల ఉక్కు స్తంభాలపై నిర్మించిన వంతెనను రెండు మోకులతో వేలాడదీశారు. ఒక్కొక్క మోకు రెండడుగుల మందాన్ని కలిగి 11,618 ఉక్కు పోగులతో చేయబడింది. ఈ వంతెన పొడవు సుమారు ఒకటిన్నర మైలు ఉంటుంది.

కాంటిలీవర్ పద్ధతిలో కొన్ని వంతెనలను తయారయ్యాయి. ధృఢంగా ఉండే స్తంభానికి లంబంగా వంతెన భాగం ముందుకు చొచ్చుకొని వచ్చేలా దీన్ని నిర్మిస్తారు. వంతెన కింది భాగంలో మరే ఆధారమూ ఉండదు. ప్రాచీన చైనా లో ఇలాంటి మొరటు నమూలాలుండేవి. 19 వ శతాబ్దం ప్రారంభ కాలంలో చేత ఇనుము తో పనిముట్ల తయారీ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇనప దూలాలతో వంతెనలు నిర్మించబడేవి. మెనాయ్ జలసంధి మీద బ్రిటానియా వంతెనని ఈ పద్ధతిలోనే నిర్మించారు. ఇలాంటి వంతెనలు చూడటానికి అందంగా ఉండవు. కమాను వంతెనలైతే చూడ ముచ్చటగా ఉంటాయి. కాబట్టి పురాతన కాలం నుంచీ కూడా ఇంజనీర్లకు వీటిపై మోజు ఎక్కువ. మొదట్లో వంతెనకు సంబంధించిన స్తంభాలను రాతితో గానీ, ఇటుక తో గానీ కట్టేవారు. 18 వ శతాబ్దం చివరి భాగం నుంచి ఇనుమును, ఉక్కును వాడటం ప్రారంభించారు. ఇలాంటి వంతెనలు జర్మనీ, నార్వే, స్వీడన్ దేశాల్లో ఉన్నాయి. 1963 లో చెనపీక్ అఖాతానికి అడ్డంగా వర్జీనియా లో 17.5 మైళ్ళ పొడవు గల వంతెననినిర్మించటం జరిగింది. ఇక్కడ ఉపయోగించిన ఉక్కు చట్రం పొడవు 12 మైళ్ళుంది. దీని కింద పెద్ద ఓడలు వళ్ళ టానికి కూడా వీలు కలగజేశారు.

వంతెనలలో రకాలు

ఇనుప వంతెనలు

కేవలం ఇనుమును మాత్రమే ఉపయోగించి నిర్మించబడే వంతెనలు. భారతదేశములో ఇలాంటివి ఎక్కువగా బ్రిటిష్ వారి కాలములో నిర్మించబడ్డాయి. ఇనుప కమ్ములు, ఇనుప దూలాలను వినియోగించి నిర్మించిన ఇలాంటి వంతెనలు ఇప్పటికీ చెక్కుచెదరక నిలిచి ఉన్నాయి.

కాంక్రీటు వంతెనలు

కాంక్రీటును ఇనుప చట్రాలలో పోసి తయారుచేసే పలకలతో, స్తంబాలతో నిర్మించే వంతెనలు కాంక్రీటు వంతెనలు. ప్రస్తుతము కట్టబడుతున్న అన్ని వంతెనలు ఇంచుమించు ఇలాంటివే. ఇవి ఎంతో పటిష్టంగా ఉండటంతోపాటు ఎక్కువ జీవితకాలాన్ని కలిగిఉంటాయి.

తాళ్ళ వంతెనలు

తాళ్ళతోనూ, వెదురు బద్దలతోను నిర్మించబడేవి తాళ్ళ వంతెనలు. అడవులలో చిన్నచిన్న లోయలను కలుపుటకు, తాత్కాలిక వంతెనలు అవసరమయినపుడు వీటిని ఉపయోగిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలు అభిబృద్ధి చెందని రోజుల్లో ఎక్కువగా ఈ తాళ్ళ వంతెనలే నిర్మించబడేవి. ప్రస్తుతము పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులను ఆకర్షించుటకు వీటిని నిర్మిస్తున్నారు.

చెక్క వంతెనలు

పూర్తిగా చెక్కతో నిర్మితమయ్యే వంతెనలు చెక్క వంతెనలు. కలపను చెక్కలుగా కోసి వాటిని మేకులు లేదా తాళ్ళతో అతికించి నిర్మిస్తారు. ఇవి తాళ్ళ వంతెనల కన్నా ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి.

ప్రపంచములో అతి పెద్ద వంతెనలు

ప్రపంచంలో అతిపెద్ద వంతెన(జపాన్ లో వ్రేలాడే వంతెన)

భారతదేశంలో వంతెనలు

రోడ్డు వంతెనలు

రైలు వంతెనలు

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=వంతెన&oldid=823597" నుండి వెలికితీశారు