రూటేసి
స్వరూపం
రూటేసి | |
---|---|
Skimmia japonica | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | రూటేసి Juss., 1789
|
Type genus | |
రూటా | |
ప్రజాతి | |
About 160, totaling over 1600 species. |
రూటేసి (Rutaceae) కుటుంబంలో సుమారు 150 ప్రజాతులు, 1300 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతాయి.
కుటుంబ లక్షణాలు
[మార్చు]- మొక్కలు, పొదలు లేదా వృక్షాలు.
- సంయుక్త పత్రాలు, పుచ్ఛరహితము, గ్రంథి భరితము.
- ద్విలింగ పుష్పాలు, అండకోశాధస్థితము, సౌష్టవయుతము, పంచభాగయుతము, సంపూర్ణము.
- అండాశయము క్రింద వర్తులాకార చక్రము ఉంటుంది.
- రక్షక, ఆకర్షణ పత్రాలు 4 లేదా 5
- కేసరాలు 8-10, లేదా అనేకము, ఆబ్డిప్లోస్టెమోనస్.
- ఫలదళాలు 2, సంయుక్తము, ఊర్థ్వ అండాశయము.
- స్తంభ అండాన్యాసము.
- ఫలము మృదుఫలము, హెస్పరిడియం లేదా గుళిక.
ఆర్ధిక ప్రాముఖ్యత
[మార్చు]- సిట్రస్ జాతులైన నిమ్మ, బత్తాయి, నారింజ మొక్కలనుండి తినదగిన పండ్లు లభిస్తాయి.
- వెలగ పండ్లలోని గుజ్జును తింటారు. ఇది అజీర్తిని హరిస్తుంది.
- కరివేపాకు పత్రాలను వంటలలో సువాసన కొరకు ఉపయోగిస్తారు.
- మారేడు పండు గుజ్జు అజీర్తిని హరిస్తుంది.
- సదాపాకు మందులో ఉపయోగిస్తారు.
- మాదీఫలం పండ్లరసం అజీర్తిని హరిస్తుంది.
- క్లోరెక్సైలాన్ స్విటేనియా (Chloroxylon swietenia) నుండి సాటిన్ ఉడ్ (Satin wood) లభిస్తుంది. దీనిని ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.
- కొన్ని మొక్కలను తోటలలో పెంచుతారు.
ముఖ్యమైన మొక్కలు
[మార్చు]- సిట్రస్ (Citrus) :
- నారింజ
- దబ్బ
- ఎగెల్ (Egel) : ఎగెల్ మార్మలోస్ - మారేడు
- ముర్రయా (Murraya) : ముర్రయా కొనిగి - కరివేపాకు
- రూటా (Ruta) : సదాపాకు
- లిమోనియా (Limonia) : లిమోనియా ఎలిఫెంటమ్ - వెలగ
- టొడ్డాలియా (Toddalia) : టొడ్డాలియా ఆసియాటికా - కొండ కసింద
మూలాలు
[మార్చు]- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.