డోపమైన్
డోపమైన్ నిర్మాణం | |
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
4-(2-Aminoethyl)benzene-1,2-diol | |
Clinical data | |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ? |
Pharmacokinetic data | |
మెటాబాలిజం | MAO, COMT[1] |
Identifiers | |
CAS number | 51-61-6 62-31-7 (hydrochloride) |
ATC code | ? |
PubChem | CID 681 |
IUPHAR ligand | 940 |
DrugBank | DB00988 |
ChemSpider | 661 |
UNII | VTD58H1Z2X |
KEGG | C03758 |
Synonyms |
|
Chemical data | |
Formula | C8H11NO2 |
|
డోపమైన్ మెదడులోనూ, శరీరంలోనూ కీలకపాత్ర పోషించే ఒక నాడీ ప్రసారిణి (న్యూరోట్రాన్స్‌మిటర్). ఇది ఒక కర్బన రసాయనం. మెదడులో ఇది ఒక నాడీ ప్రసారిణిలా పనిచేస్తుంది. న్యూరాన్లు ఒకదాని నుంచి మరొకదానికి సందేశం పంపుకోవడానికి దీనిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి మెదడులోని కొన్ని ప్రత్యేక భాగాల్లో ఉత్పత్తి అవుతాయి కానీ, చాలా భాగాలను ప్రభావితం చేస్తాయి.మోటారు నియంత్రణ, ప్రేరణ, బహుమతి, అభిజ్ఞా పనితీరు, తల్లి, పునరుత్పత్తి ప్రవర్తనలు వంటి న్యూరోమోడ్యులేషన్‌లో డోపమినెర్జిక్ వ్యవస్థ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది[2].ఇది రెండు దశల ప్రక్రియ ద్వారా మెదడులో తయారవుతుంది. మొదట, ఇది అమైనో ఆమ్లం టైరోసిన్‌ను డోపా అనే పదార్థానికి మారుస్తుంది, ఆపై డోపమైన్‌గా మారుతుంది.
ఏదైనా ప్రతిఫలం దక్కుతుందన్న ఊహ జనించగానే మెదడులో డోపమైన్ విడుదల స్థాయి పెరుగుతుంది.[3] అలాగే ఏదైనా మానలేని మాదక ద్రవ్యాలు కూడా డోపమైన్ స్థాయిని పెంచుతాయి, లేదా ఒకసారి విడుదలైన తర్వాత న్యూరాన్లు దానిని తిరిగి లోపలికి తీసుకోకుండా అడ్డుకుంటాయి.
నరాల సంబంధించిన చాలా సమస్యలకు డోపమైన్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం ముఖ్యకారణం. వీటిని నయం చేసే ఔషధాలు కూడా డోపమైన్ ప్రభావాల్ని మార్పు చేయడం ద్వారా పనిచేస్తాయి. ఉదాహరణకు శరీరంలో వణుకును, కదలికల సమస్యను కలిగించే పార్కిన్‌సన్ వ్యాధి సబ్‌స్టాన్షియా నిగ్రా అనే మెదడు మధ్యభాగంలో డోపమైన్ ని విడుదల చేసే న్యూరాన్లు కోల్పోవడం వలన వస్తుంది. మానసిక భ్రాంతులను కలిగించే స్కిజోఫ్రీనియా వ్యాధి కూడా డోపమైన్ లోపం వల్లనే కలుగుతున్నట్లు ఆధారాలున్నాయి.
డోపమైన్ ద్వారా ప్రభావితం అయ్యే శారీరక విధులు[4]
- చదువు
- ప్రేరేపణ
- గుండె కొట్టుకునే రేటు
- రక్తనాళాల పనితీరు
- మూత్రపిండాల పనితీరు
- చనుబాలివ్వడం
- నిద్ర
- మూడ్
- ధ్యాస
- వికారం, వాంతులు నియంత్రణ
- నొప్పి స్పందన
- కదలిక
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;DA IUPHAR
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Dopamine Functions". News-Medical.net (in ఇంగ్లీష్). 2010-01-10. Retrieved 2021-11-02.
- ↑ Berridge, Kent C. (April 2007). "The debate over dopamine's role in reward: the case for incentive salience". Psychopharmacology. 191 (3): 391–431. doi:10.1007/s00213-006-0578-x. ISSN 0033-3158. PMID 17072591. S2CID 468204.
- ↑ Cristol, Hope. "What Is Dopamine?". WebMD (in ఇంగ్లీష్). Retrieved 2021-11-02.