1612
స్వరూపం
1612 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1609 1610 1611 - 1612 - 1613 1614 1615 |
దశాబ్దాలు: | 1590 1600లు - 1610లు - 1620లు 1630లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 20: రుడాల్ఫ్ II మరణం తరువాత మాథియాస్ పవిత్ర రోమన్ చక్రవర్తి అయ్యాడు . [1]
- జనవరి 20 – నవంబర్ 4: మాస్కోలో జరిగిన తిరుగుబాటు పోలిష్ దళాలను వెళ్ళగొట్టింది.
- మార్చి 2: ఫాల్స్ డిమిత్రి III ను కోసాక్కులు జార్‌గా గుర్తించారు.
- మే 10: షాజహాన్ వివాహం ముంతాజ్ మహల్‌తో జరిగింది.
- ఆగస్టు 20: ఇంగ్లాండ్‌లోని లాంకాషైర్‌లో మంత్రవిద్యను అభ్యసించినందుకు దోషిగా తేలిన పది పెండిల్ మంత్రగత్తెలను ఉరితీశారు.
- నవంబర్ 29: ఒట్టోమన్ సామ్రాజ్యం, సఫావిడ్ సామ్రాజ్యం మధ్య నాసు పాషా ఒప్పందం కుదిరింది.
- నవంబర్ 30: స్వాలీ యుద్ధం : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగల్ల దళాలు భారత తీరంలో పోరాడాయి. బ్రిటన్ విజయం సాధించింది.
- డిసెంబర్ 15: టెలిస్కోప్ ద్వారా ఆండ్రోమెడా గెలాక్సీని పరిశీలించిన మొదటి వ్యక్తి సైమన్ మారియస్ .
- డిసెంబర్ 28: బృహస్పతితో కలిపి నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించిన మొట్టమొదటి ఖగోళ శాస్త్రవేత్తగా గెలీలియో గెలీలీ నిలిచాడు. అయితే, అతను పొరపాటున దానిని స్థిర నక్షత్రంగా భావించాడు. గెలీలియో తన టెలిస్కోప్‌తో మొదటిసారి చూసిన 234 సంవత్సరాల తరువాత, 1846 వరకు నెప్ట్యూన్‌ను కనుగొనలేదు.
- జపాన్‌లో నాగోయా కోట నిర్మాణం పూర్తయింది.
- డాన్ క్విక్సోట్ మొదటి భాగానికి థామస్ షెల్టన్ చేసిన ఆంగ్ల అనువాదం ప్రచురించబడింది. ఇది ఈ స్పానిష్ నవలకు జరిగిన మొట్ట మొదటి అనువాదం.
జననాలు
[మార్చు]- అక్టోబర్ 14: థామస్ ఫిచ్, కనెక్టికట్ సెటిలర్. (మ.1704)
- విలియం గేస్కోయిన్, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త. (మ.1644)
మరణాలు
[మార్చు]- ముహమ్మద్ కులీ కుతుబ్ షా - కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. హైదరాబాద్ నగర స్థాపకుడు. (జ.1580)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 244. ISBN 0-304-35730-8.